calender_icon.png 9 February, 2026 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను అమలు చేసి చూపిస్తా

09-02-2026 01:10:22 AM

10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేష్ గౌడ్

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 8: గడ్డపోతారం, మాదారం మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఇంటింటికి ముమ్మరంగా ప్రచా రం నిర్వహించారు. ఐదేళ్లపాటు ప్రజలకు సేవకునిగా పని చేసేందుకు 10వ వార్డు కౌ న్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, వార్డు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. 10వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందు కు తన వంతు కృషి చేస్తానన్నారు.

నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా వారికి అండగా ఉంటానన్నారు. సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారలతో నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడుతానన్నారు. అందుకు ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ ముదిరాజ్, ప్రవీణ్ యా దవ్, దాస్ గౌడ్, సాయి గౌడ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.