09-02-2026 01:11:58 AM
12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శివాని లక్ష్మణ్‌సింగ్
జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 8: అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి అంటూ మాజీ వార్డు సభ్యుడు ఠాకూర్ రాజేందర్ సింగ్, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఠాకూర్ శివాని లక్ష్మణ్ సింగ్ ప్రజలను కోరారు. గడ్డపోతారం మాదారంలో 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
వార్డు పరిధిలో అవసరం ఉ న్న ప్రతి చోట సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. కాటా శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారలతో ని ధులు తెచ్చి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. చేతి గుర్తుపై ఓటేసి భా రీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.