టీ20ల్లో 200 కొడతా
- గేల్ రికార్డు బ్రేక్ చేస్తా
- వైభవ్ సూర్యవంశీ కామెంట్స్
ముంబై, మే 25 : 14 ఏళ్లకే ప్రపంచ క్రికెట్‌లో రికార్డులకు చిరునామాగా మారిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తు త ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఈ బుడ్డోడు చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న వైభవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొడతానని చెప్పా డు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ హోస్ట్ చేస్తున్న ’ది స్విచ్’ అనే టాక్ షోలో వైభవ్ సూర్యవంశీ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా పీటర్సన్‌తో మాట్లాడుతూ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో నెలకొల్పిన ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల ఆల్‌టైం రికార్డును తాను బ్రేక్ చేయాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. పూరిగ్తా 20 ఓవర్లు క్రీజులో నిలబడి బ్యా టింగ్ చేయగలిగితే కచ్చితంగా గేల్ రికార్డు ను దాటేసి డబుల్ సెంచరీ సాధిస్తానని వై భవ్ స్పష్టం చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర ఫున గేల్ చేసిన 175 పరుగుల రికార్డు ఇప్పటివరకు పదిలంగా ఉంది.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌లల్లో 41.64 సగటుతో, ఏకంగా 232 పైగా స్ట్రుక్‌ర్రేట్‌తో 583 పరుగులు సా ధించాడు. దీనిలో ఒక సెంచరీ, 3 హాఫ్ సెం చరీలు ఉన్నాయి.
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 5వ స్థానంలో ఉన్న వైభవ్ లీగ్ దశ లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్-5 బ్యాటర్లలో నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అలాగే సిక్సరతో స్టేడియాలను హోరెత్తిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూ డా రికార్డు సృష్టించాడు.






