26 May, 2026 | 2:39 AM

తమ కుమారుడి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి

26-05-2026 01:53 AM

తండ్రి బల్గూరి మైసయ్య విజ్ఞప్తి

కోదాడ, మే 25 :కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన బల్గూరి గణేష్ కేసును పోలీసులు పారదర్శకంగా విచారణ చేపట్టి అసలు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి బల్గూరి మైసయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం గణపవరం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బల్గూరి మైసయ్య మాట్లాడుతూ పోలీసులు యాప్ కోణంలో కాకుండా ప్రేమ వ్యవహారం, ఇతర కారణాల్లో అన్వేషించి తగిన విచారణ చేసి హత్యకు కారణాలను బయటకు వెలికితీయాలని కోరారు. అసలు దోషులెవరో గుర్తించి వారికి శిక్షపడే వరకు తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో బల్గూరి మైసయ్య కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు.