రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
26-05-2026 01:50 AM
కోదాడ (మునగాల) మే 25,జాతీయ రహదారి నెం.65పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం మునగాల మండల పరిధిలో మెద్దుల చెరువు సమీపంలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య (57), అతని కూతురు కీత సునీత (40)లు తన ద్విచక్ర వాహనంపై మునగాల బ్యాంకు పని చూసుకొని మాధవరం వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో మొద్దులచెరువు స్టేజి సమీపానికి వెళ్ళగానే వెనుక నుండి కారు ఢీ కొట్టిందన్నారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలు అక్కడక్కడే మృతి చెందాతన్నారు. ఇరువురి మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ రత్నం తెలిపారు.






