హెడ్ భార్యకు వేధింపులు
అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన
ముంబై, మే 25 : సన్‌రైజర్స్ హైదరాబా ద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య గొడవ బాగా వైరల్ అయింది. కోహ్లీని హెడ్ రెచ్చగొట్టడం, దానికి విరాట్ కూడా ధీటుగా స్పం దించడం, మ్యాచ్ తర్వాత అతనికి షేక్ హ్యాం డ్ ఇవ్వకపోవడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఈ గొడవ ముగిసిపో యిందనుకుంటున్న వేళ హెడ్ భార్యకు అభిమానుల నుంచి వేధింపులు మొదలయ్యా యి.
కొందరు ఆకతాయిలు హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్‌లైన్ వేధింపులకు దిగిన ట్లు తెలుస్తోంది. తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జె స్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచకప్ సంఘటన తర్వాత తనపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోందని పేర్కొంది.
తనతో పాటు కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారనీ వాపోయింది. క్రీ డా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదన్న జెస్సీకా ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది. కీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజమ నీ, ఆటను ఆటగానే చూడాలి తప్ప ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకు రాకూడదనీ హితవు పలికింది.






