26 May, 2026 | 2:38 AM

తొలి అడుగు ఎవరిదో?

26-05-2026 12:00 AM
  1. క్వాలిఫైయర్ 1కు అంతా రెడీ
  2. బెంగళూరుతో గుజరాత్ ఢీ
  3. గెలిస్తే ఫైనల్ ఎంట్రీ
  4. ఓడిన జట్టుకు మరో ఛాన్స్

* ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్స్ స్టేజ్ కు చేరింది. లీగ్ స్టేజ్ ముగియడంతో నాలుగు జట్లు ముందంజ వేయగా ఇక ప్లే ఆఫ్స్ సమరాలు అభిమానులు అలరించబోతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 1లో తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 

ధర్మశాల, మే 25 : ఐపీఎల్‌లో తొలి క్వాలిఫైయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో టైటిల్ పై కన్నేసిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజ రాత్ టైటాన్స్ ధర్మశాల వేదికగా తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. లీగ్ స్టేజ్ ను అగ్రస్థానంతో ముగించింది. 14 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించిన ఆర్సీబీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

బ్యాటింగ్‌లో కోహ్లీ, పడిక్కల్, పటిదార్, టిమ్ డేవిడ్ ఈ నలుగురు రాణిస్తుండడం బెంగ ళూరుకు బలంగా చెప్పొచ్చు. అయితే ఫిల్ సాల్ట్ క్వాలిఫైయర్ 1లో ఆడతాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. గాయంతో స్వదేశానికి వెళ్లి మళ్లీ తిరిగొచ్చిన సాల్ట్ ఆడకుంటే వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకా శాలున్నాయి. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై వెంకటేశ్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించలేక ఓడిపోయిన ఆర్సీబీని తక్కు వ అంచనా వేసేందుకు వీలులేదు.

బ్యాటింగ్ పరంగా కీల క ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు అడ్వాంటేజ్. టిమ్ డేవిడ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశముంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్‌వుడ్ పేస్ విభాగానికి కీలకంగా ఉన్నారు. ము ఖ్యంగా భువనేశ్వర్ తన పేస్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపిం చాడు. ఈ వెటరన్ పేసర్ నిలకడగా రాణిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యువ పేసర్ రసిక్ సలామ్ దా ర్ కూడా సత్తా చాటుతున్నాడు.

స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యాతో పాటు సు యాశ్ శర్మపై అంచనాలున్నా యి. కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. వీరు సమిష్టిగా చెలరేగితే ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరోవైపు గుజరాత్ కూడా ఈ సీజన్‌లో అదరగొడుతోంది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడినా సెకండాఫ్‌లో అద్భుతంగా పుంజుకుంది. వరుస విజయాలతో టాప్ 2లో నిలిచింది.

ఆర్సీబీ తరహాలోనే లీగ్ స్టేజ్‌లో 9 మ్యాచ్‌లు గెలిచింది. చివరి ఏడు మ్యాచ్‌ల లో ఆరింట గెలిచిందంటే ఆ జట్టు ఏ విధంగా బౌన్స్‌బ్యాక్ అయిం దో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ బ్యాటింగ్‌లో ఎక్కువగా గిల్, సాయి సుదర్శన్‌పై ఆధారపడుతోంది. వన్‌డౌన్‌లో బట్లర్ కూడా రాణిస్తున్నాడు. అటు బౌలింగ్ కు సంబంధించి పేసర్లు కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ సత్తా చా టుతున్నారు. ముఖ్యంగా రబాడ ఫామ్ అందుకోగా.. సిరాజ్ కూడా కీలక వికెట్లు తీస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ లాంటి మ్యా చ్ విన్నర్ గుజరాత్‌కు ప్రధాన బలంగా చె ప్పొచ్చు. 

గత రికార్డులు

ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు రెండు సా ర్లు తలపడగా.. ఎవరి హౌంగ్రౌండ్‌లో ఆ జట్టు గెలిచింది. ఓవరాల్‌గా ఇరు జట్లు 8 మ్యాచ్‌లలో తలపడితే సగం సగం గెలిచాయి. 

పిచ్ రిపోర్ట్

ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలించనుండగా ఇక్కడ సగటు స్కోరు 211 పరుగులుగా ఉంది. దీంతో మరో హైస్కోరింగ్ మ్యాచ్ ఖా యం. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ వైపే మొగ్గు చూపొచ్చు.

తుది జట్ల అంచనా 

బెంగళూరు : సాల్ట్/వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ, పడిక్క ల్ , పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, షెఫ ర్డ్, భువనేశ్వర్, హ్యాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసి క్ సలామ్ దార్

గుజరాత్ : సాయి సుదర్శన్, గిల్(కెప్టెన్), బట్లర్, నిశాంత్, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, తెవాటియా, రషీద్‌ఖాన్, రబా డ, అర్షద్ ఖాన్, సిరాజ్