మళ్లీ నేనే ఎమ్మెల్యే.!
11-06-2026 11:03 AM
కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
బిజినపల్లి: ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మళ్లీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి నివేదిక బస్సు యాత్రలో భాగంగా బుధవారం బిజినపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.






