14 May, 2026 | 4:19 AM

నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా

14-05-2026 02:09 AM

గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రాంరెడ్డి

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, కేసుల విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని  పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రాంరెడ్డి స్పష్టం చేశారు. పంచాయ తీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా రాంరెడ్డి, సభ్యులుగా నాగులూరి కృష్ణ కుమార్, బాస వేణుగోపాల్ యాదవ్ బుధవారం  పంచాయ తీరా జ్ ఈఎన్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 

రాంరెడ్డి మాట్లాడుతూ అప్పీ ల్ కేసులకు సంబంధించి విచారణ వేగవం తం చేసి త్వరితగతిన, చట్టబద్ధంగా తీర్పుల ను వెలువరిస్తామన్నారు.  కల్వకుర్తి ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సూదిని పద్మారెడ్డి, మనోహర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సాయిరెడ్డి, కే.నాగమణి, మహ్మద్ అధర్ పర్వేజ్  పాల్గొన్నారు.