ఆర్టీసీ బస్సు కారు ఢీ
14-05-2026 02:14 AM
- ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
- ఖాదర్‌గూడెం శివారులో ఘటన
మానకొండూరు, మే 13 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, స్విఫ్ట్ డిజైర్ కారు బుధవారం రాత్రి ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారు డ్రైవర్ ఖలీద్, ముందు కూర్చున్న వ్యక్తి రాజు ఘటనా స్థలంలోనే మరణించారు.
కారు వెనక సీటులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సు బోధన్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా నేషనల్ హైవే 563, మానకొండూరు మండలం ఖాదర్ గూడెం శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారు డివైడర్ పక్కన రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఎదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.






