24 August, 2026 | 4:49 AM

అంజయ్యనగర్‌లో హైడ్రా కొరడా

24-08-2026 12:03 AM
  1. బాహుబలి క్రేన్‌తో అక్రమ భవనాల కూల్చివేతలు
  2. అక్రమ భవనాలను పరిశీలిస్తున్న మున్సిపల్, హైడ్రా అధికారులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (విజయక్రాం తి): అంజయ్యనగర్‌లో హైడ్రా కొరడా ఝు ళిపిస్తోంది. శనివారం ఏడంతస్థుల అక్రమ భవనం కూలిపోయిన ఘటన నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలకు పూనుకున్నారు. -బాహుబలి క్రేన్‌తో అక్రమ భవనాల కూల్చివేతలను ఆదివారం ముమ్మరం చేశారు. ప్రమాదకరంగా ఉన్న మరో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. మరోపక్క అక్రమ భవనాలను మున్సిపల్, హైడ్రా అధికారులు పరిశీలిస్తూ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం అంజయ్యన గర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవ నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన తో కూలిన భవనం పక్కనే ఉన్న మరో అక్ర మ నిర్మాణం 50 శాతం మేర దెబ్బతిన్నది. దీన్ని వెంటనే కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు భారీ యంత్రాలను సమీకరించారు. బాహుబలి క్రేన్ సాయంతో ఆ భవనాన్ని ధ్వంసం చేశారు. ఈ భవనంతో పాటు మరో ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి.

ప్రమాదం అంచున ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్ప ష్టం చేశారు. 50 గజాల స్థలంలో నాలా పక్క న అనుమతులు లేకుండా నిర్మించిన ఎత్తున భవనాలపై హైడ్రా కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు.