రైతు బీమాను తుంగలో తొక్కాలని చూస్తున్న ప్రభుత్వం
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సతీష్
పాలకవీడు, ఆగష్టు 23: రైతులకు ధీమాగా ఉన్న రైతు బీమాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా తుంగలో తొక్కాలని చూస్తుంది అని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమాళ్ళ సతీష్ అన్నారు. మండలంలోని ముసివోడ్డు సింగారం గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నకిరేకంటి దుర్గయ్య అనే యువరైతు అనారోగ్యంతో ఆగస్టు 15వ తారీకు రాత్రి మరణించారు ఆ రైతుకు 30 గుంటల భూమి ఉంది రైతుబీమా బాండ్ అగ్రికల్చర్ అధికారులకు చూపించడంతో ఆ బాండ్ ఇప్పుడు చెల్లదు అని ఆగస్టు 12 కంటే ముందు చనిపోయిన వారికే వర్తిస్తుంది అన్ని అధికారులు చెపుతున్నారన్నారు.
అప్పుల బాధలో ఉన్న దళిత కుటుంబానికి చెందిన నకిరేకంటి దుర్గయ్య కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో 2018లో ఈ రైతుబీమా రైతులకు ధీమాగా ఉండాలి అని చెప్పి ఒక కుంట జాగా ఉండే రైతు మరణించిన ఆ దిన వారాలు అయ్యే సరికి ఐదు లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ప్రభుత్వమే చెల్లించేది అని ఈ పథకం ద్వారా లక్షలాదిమంది రైతుల కుటుంబాలు ఆసరైందనన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బాండ్లను రెన్యువల్ చేయకుండా రైతులకు నిండా ముంచుతుంది అన్ని మందిపడ్డారు. ఈ కార్యక్రమంలో బోయబోయిన బిక్షం. కోటయ్య .కొండలు. గౌస్. నన్నేసాబ్ .కాశయ్య. నరేందర్ సీతారాములు. సైదులు. కాశయ్య. తదితరులు పాల్గొన్నారు.






