calender_icon.png 17 February, 2026 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మా రంగంలో హైదరాబాద్ అగ్రగామి

17-02-2026 11:24:05 AM

హైదరాబాద్: హైటెక్స్ వేదికగా బయో ఆసియా సదస్సు(Bio Asia 2026 Summit) కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సమిట్ ఇది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... హైదరాబాద్ కేంద్రంగా 14 బిలియన్ వ్యాక్సిన్లు ఉత్పత్రి జరిగిందని చెప్పారు. ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫార్మారంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతకు తెలంగాణ దోహదపడుతోందని వివరించారు. తెలంగాణ బలం.. పరిశోధన కేంద్రాలకు మాత్రమే పరిమితం కాదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.