ఘట్ కేసర్ బ్రిడ్జి సాధనకు ఈ నెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష
ఘట్ కేసర్, మే 1 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి పూర్తి నిర్మాణం సాధనకు ఈనెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ సమీపంలోని స్వామి వివేకానంద విగ్రహం ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ప్రాణ సంకటంగా మారి ఎంతో మంది అమాయాకుల ప్రాణాలు బలిగొన్న రైల్వే క్రాసింగ్ కు స్వస్తి పలికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి సాధనకై జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణంలోని బాలాజీనగర్, ఈడబ్ల్యూఎస్ కాలనీ, గాంధీనగర్, గుంటిగూడెం, కొండాపూర్ తదితర కాలనీల ప్రజలు, మహిళలు, యువత పాల్గొని అబ్బసాని యాదగిరి యాదవ్ కు మద్దత ప్రకటించారు.






