1 March, 2026 | 3:02 PM

ఖమేనీ మృతి.. పలు చోట్ల సంబరాలు

01-03-2026 12:52 PM

టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల మొదటి రోజే ఆయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) మరణించిన విషయం తెలిసిందే.  ఖమేనీ మృతి పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఇరాన్ క్యాబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతి పట్ల ప్రభుత్వ మద్దతుదారులు విషాదంలో కూరుకుపోతే.. మరికొన్ని చోట్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయనకు ఖమేనీ మద్దతుదారులు వ్యక్తిగతంగా సంతాపం ప్రకటిస్తున్నారు. టెహ్రాన్ లోని పలు ప్రాంతాల్లో జనం బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. కిరాబ్ నగర విధుల్లోని మేడలు, బాల్కనీల నుంచి స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ ప్రజలు నినాదాలు చేస్తుండగా, మరికొంత మంది మహిళాలు హిజాబ్ లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే లాస్ ఏంజిల్స్ లండన్, మెల్ బోర్న్ వంటి ప్రాంతాల్లోనూ ఇరాన్ ప్రవాసులు వేడుకలు చేసుకుంటున్నారు.