9 July, 2026 | 2:34 AM

విద్యార్థినులకు హెచ్‌పీవీ రక్షణ

09-07-2026 01:43 AM

నాగల్గిద్ద, జూలై 8: మండలంలో హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం తెలిపారు. ఈ సందర్భంగా మోర్గి మోడల్ స్కూల్లో అర్హత కలిగిన విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ను విజయవంతంగా అందించినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 150 మందికి పైగా విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని, అర్హులైన విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్ విక్టోరియా రాణి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సువర్ణ, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.