ఎంతకాలం పీక్కుతింటారు
- దొంగ దీక్షలు చేసి తెలంగాణ బిడ్డలను బలిగొన్నారు
- మండిపడ్డ ప్రభుత్వ విప్ వేముల వీరేశం
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): తెలంగాణను ఇంకెంత కాలం పీక్కుతింటారని బీఆర్‌ఎస్‌పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వే ముల వీరేశం మండిపడ్డారు. తెలంగాణ ఉ ద్యమాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై ఆయన ఫైర్ అయ్యారు. కిరోసిన్ డబ్బా చూపించి ఉద్యమకారులను ఆ త్మహత్యలకు పురికొల్పారని, దొంగ దీక్షలు చేసి తెలంగాణ బిడ్డలను వారి కుటుంబాలకు దూరం చేశారని వేముల ఆరోపించా రు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీ కాళ్ల మీద పడి, వెను క నుంచి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లిని గడీలో బందీ చేశారని, కల్వకుంట్ల రాజ్యాంగంతో రాక్షస పాలన చేసి రక్తపిపాసులుగా మారారని ఆయన దుయ్యబట్టారు.
రైతులకు బేడీలు వేశారని, నేరెళ్ల దళితులకు కరెంటు షాక్‌లు పెట్టారని, ప్రగతి భవన్ ముందు ముళ్లకంచెలతో ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని, సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, చివరకు ప్రజా చైతన్యం ముందు కుప్పకూలి ఫామ్‌హౌస్‌లో బందీ అయ్యారని విమర్శించారు. కాళే శ్వరం బ్యారేజీలు కొట్టుకుపోయి అమాయకుల ప్రాణాలు పోవాలా? రెచ్చగొట్టి రాజ్యా ధికారం సాధించాలనుకుంటున్నారా? అని వేముల నిలదీశారు. తెలంగాణ ప్రజల చైత న్యం ముందు చరిత్రలోనే మిగిలిపోయారని, ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారని వేముల వీరే శం హెచ్చరించారు.






