13 July, 2026 | 1:55 AM

హంతకుడి కోసం వేట

13-07-2026 12:50 AM
  1. షాబాద్ ఘటన నిందితుడి కోసం ముమ్మర గాలింపు
  2. చేగురు అడవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
  3. డాబాలు, హైవేల వెంబడి విస్తృత తనిఖీలు
  4. నిందితుడు చిక్కాడంటూ ప్రచారం అవాస్తవం
  5. అచూకీ తెలిపిన వారికి రూ.౨లక్షల రివార్డు
  6. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్

చేవెళ్ల/షాద్‌నగర్, జూలై 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని దారుణంగా హ త్య చేసిన రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే హంతకుడు పోలీసులకు చిక్కాడం టూ ఆదివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది. కొత్తూరు మండలంలోని అక్కివేని గూడెం సమీపంలో నిందితుడిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు గు ప్పుమన్నాయి.

అక్కివేని గూడెం సమీపంలో మొహానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అక్కడ జామకాయ తింటూ, టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందో కనుక్కునేందుకు ప్రయత్నిస్తుండగా.. కాపు కాసిన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారని స్థా నికులు కొందరు పేర్కొన్నారు. కొత్తూరు మండలం కుమ్మరిగూడానికి చెందిన బంద రు సుధాకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను రాజ్‌కుమార్‌ను ప్రత్యక్షంగా చూశాను. ఆయ న జామకాయ తింటూ, టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని నన్ను అడిగాడు.

నేను చెప్తుండగా నే.. ఇంతలో పోలీసులు వచ్చి అతడిని పట్టుకున్నారు’ అని చెప్పడం గమనార్హం. అయితే అక్కడ రంగంలోకి దిగింది స్థానిక పోలీసు లా లేక ప్రత్యేక బృందాలా అనేది స్పష్టత రాలేదు. అయితే, ఈ ప్రచారాన్ని చేవెళ్ల డీసీ పీ యోగేష్ గౌతం తీవ్రంగా ఖండించారు. హంతకుడు ఇంకా పట్టుబడలేదని, వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. కాగారాజ్‌కుమార్ ఉపయోగించిన కారు శనివారం కొత్తూరు మండలం చేగూరు రైల్వే లైన్ సమీపంలో లభ్యమవడంతో పోలీసు లు ఆ ప్రాంతంలో గాలింపు తీవ్రం చేశారు.

నిందితుడు చేగురు రైల్వే ట్రాక్ దాటి సమీపంలోని అడవి ప్రాంతంలోకి వెళ్లినట్లు పోలీ సులు అనుమానిస్తున్నారు. రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్‌ను శుక్రవారం రాత్రి 11:47 గంటలకే స్విచ్ ఆఫ్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. నిందితు డి కోసం రైల్వే పోలీస్, ట్రాకింగ్ టీమ్, హ్యూ మన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ టీమ్స్‌తో కూడిన తొమ్మిది ప్రత్యేక బృందాలు అడవి ప్రాంతా న్ని జల్లెడ పడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీలు, హైవేలు, శ్రీశైలం, కర్ణాటక మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న ఆపరేషన్‌ను 12 బృందాలకు విస్తరించారు. నింది తుడు రాష్ట్రం దాటి పరారై ఉండే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తెలం గాణతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతా ల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అతడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవ ద్దని, దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. రెండు లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిందితుడి అధికారిక అరెస్టుకు సం బంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.