9 April, 2026 | 7:49 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

09-04-2026 06:03 PM

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం:

జవహర్ నగర్, (విజయక్రాంతి):మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, జవహర్ నగర్ డివిజన్ ప్రగతి నగర్ లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సుమారు రూ. 5 లక్షల వ్యయంతో లబ్ధిదారులు నిర్మించుకున్న ఈ నూతన గృహాలను ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ వేడుకలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ హౌసింగ్ ఏఈ శ్రీహరి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని గౌరవప్రదమైన జీవనం సాగించాలని సూచించారు. సొంతింటి కల సాకారమవ్వడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు సహకరించిన అధికారులకు  నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం అతిథులను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు: మాట్లా శ్రీనివాస్, నాయకం భాస్కర్,అజయ్ కుమార్, సాయి కృష్ణ,సోమేశ్ చారి,చంద్రమౌళి  ఇతర కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.