18 June, 2026 | 4:51 PM

Breaking News

ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ల కోసం కౌన్సిలింగ్   •   స్మశాన వాటిక, గుడి మాన్యం భూములు ఆక్రమిస్తున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్   •   అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ   •   గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •  

బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు

09-04-2026 06:13 PM

పిడిఎస్ బియ్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు..

బాన్సువాడ,ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ పలు రైస్ డిపోలపై జిల్లా సివిల్ సప్లై అధికారులు సివిల్ సప్లై అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్ బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సివిల్ సప్లై డిప్యూటీ అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో డిపోలపై తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రైస్ డిపోను సీజ్ చేశారు. పిడిఎస్ బియ్యాన్ని రైస్ డిపో యజమానులు ఎవరైనా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ అశోక్ సిబ్బంది ఉన్నారు.