బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు
18-06-2026 03:40 PM
బిజినేపల్లి: మండలంలో సారా తయారీకి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలోని కొత్త తండాకు చెందిన అంగోతు ఓమ్లి, గుడ్లనర్వ తండాకు చెందిన గోపాలుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సారా తయారీకి ఉపయోగించే బెల్లం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అనంతరం ఇద్దరినీ బిజినేపల్లి తహశీల్దార్ ఎం.డి. మున్నీరుద్దీన్ ఎదుట హాజరుపరచి, ఒక్కొక్కరిని రూ.1 లక్ష జరిమానాతో బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా ఇటువంటి దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది దయాకర్, నిరంజన్, పుష్పలత పాల్గొన్నారు.






