9 April, 2026 | 7:50 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...

09-04-2026 06:02 PM

ఆసుపత్రి సూపరిండెంట్ ను కలిసిన బిజెపి నాయకులు...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్ ను గురువారం బాన్సువాడ బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఆస్పత్రిలో సిబ్బంది నియామకం ఆసుపత్రికి వచ్చే రోగులను నిజామాబాద్ కు రిఫర్ చేయకుండా బాన్సువాడ లోనే వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆంబులెన్స్ లోనే రోగులను నిజాంబాద్ కు తరలించాలని ప్రైవేట్ అంబులెన్స్ నియంత్రణ కట్టడి చేపట్టాలని ఆసుపత్రి వచ్చే రోగుల పట్ల మెరుగైన వైద్య సేవలు అందించి సహకరించాలని వారు కోరారు. సానుకూలంగా స్పందించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ భాస్కర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కో ఆప్షన్ మెంబర్ తృప్తి శివప్రసాద్, కౌన్సిలర్లు గజ్జల మహేష్, పాశం భాస్కర్ రెడ్డి, సామల శ్రీకాంత్, చీకట్ల రాజు తదితరులు ఉన్నారు.