18 June, 2026 | 4:30 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు

18-06-2026 03:38 PM

దేశాయిపేట్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు నివేదిత...

బాన్సువాడ, జూన్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదివితే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుందని దేశాయిపేట జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ఈ. నివేదిత అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరెందుకోసం సోమేశ్వర్ పోచారం గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు.

గత సంవత్సరం దేశాయిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 17 మంది 10 వ తరగతి విద్యార్థులకు గాను 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% రిజల్ట్ సాధించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 24 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య , భోజనం అందిస్తూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు అర్హులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆమె సూచించారు.