సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే
ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్ర చారి, సి.ఐ ఓదెల వెంకటేష్,ఎస్సై రాహుల్ రెడ్డి
11 సీసీ కెమెరాలు ఏర్పాటు, మరో 5 కెమెరాలు రావలసి ఉంది
ఎల్లారెడ్డి పేట జూన్ 18 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో ప్రధాన కూడలిలలో గ్రామ సర్పంచ్ మేడిపల్లి జ్యోతి - దేవానందం మరియు పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో ప్రస్తుతం సుమారు 11 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా మరో ఐదు కెమెరాలు బిగించవలసి ఉందని సర్పంచి తెలిపారు. ఇట్టి సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే చేతుల మీదగా ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.... జిల్లాలోని ప్రతి గ్రామంలో సర్పంచులు, పాలకవర్గం ముందుకు వచ్చి గ్రామంలోని ప్రధాన కూడలిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,సిసి కెమెరాలు దొంగలను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వైస్తాయని, వీటివల్ల దొంగతనాలు అరికట్టవచ్చని, కెమెరాలు ఏర్పాటు చేసినందుకు సర్పంచ్,ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి,సహకరించిన గ్రామస్తులను అభినందించారు.ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ నాగేంద్ర చారి, సి.ఐ ఓదెల వెంకటేష్, ఎస్సై రాహుల్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ సబేరా - గౌస్, రేవంత్ రెడ్డి మిత్రమండలి గుర్రాల విజయ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






