అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్ లను పంపిణీ చేశాం: ఎంఈఓ
బోథ్ . జూన్ 18 (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను నోట్ బుక్కులను సరఫరా చేయడం జరిగిందని మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. రెండో విడత లో సోనాల మండలానికి పంపిణీ చేస్తున్నామని వివరించారు. పాఠశాలకు పుస్తకాలను తీసుకువెళ్లిన ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించాలని సూచించారు. మండలంలోని మర్లపల్లి కుచులాపూర్ దన్నూర్ గ్రామాల తో పాటు బోత్ బాలికలు ఉర్దూ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. అందులో వాలంటీర్ల నియామకం త్వరలో పూర్తవుతుందన్నారు. నాలుగు సంవత్సరాలు నిన్న విద్యార్థిని విద్యార్థులను ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో తప్పనిసరిగా చేర్పించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలను మరింత పటిష్ట పరచాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను మంజూరు చేసింది అన్నారు.






