18 June, 2026 | 4:48 PM

Breaking News

అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ   •   గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •  

బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం

18-06-2026 03:42 PM

బెజ్జంకి, జూన్ 18: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో పదో తరగతిలో ప్రతిభ కనబర్చి బాసర ఐఐటీలో సీటు సాధించిన యాలల సిరి ని గురువారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు శాలువాతో సన్మానించి, కాలేజీ బ్యాగ్‌ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, బోయినపల్లి నర్సింగరావు విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ, గత కొన్నేళ్లుగా పదో తరగతి విద్యార్థులకు సొంత ఖర్చులతో సాయంత్రం అల్పాహారం అందించడం, ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వార్డు సభ్యులు ఉట్ల రాజు, మడ్డి సందీప్, రేవోజు నాగరాజు, అమ్మిగల్ల సురేష్, యాస రాకేష్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.