18 June, 2026 | 4:31 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్

18-06-2026 03:36 PM

కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తా

చేర్యాల, జూన్ 18: అఖిల భారత కార్మిక సంఘాల కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐటీయూసీ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్ ఎన్నికయ్యారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించిన పార్టీ,కార్మిక సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం,కనీస వేతనాల అమలు,సామాజిక భద్రత వంటి అంశాలపై కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.అశోక్ నియామకం పట్ల పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.తమ ఎన్నికకు కృషిచేసిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు ఆది రంగారెడ్డి,జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.