6 May, 2026 | 1:01 AM

యువతికి మెడికవర్ వైద్యుల పునర్జన్మ

06-05-2026 12:05 AM

పోస్ట్-అబార్షన్ నుంచి ప్రాణాలను కాపాడిన హాస్పిటల్ డాక్టర్లు

గర్భాశయాన్ని సంరక్షించిన నిపుణుల బృందం

హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): గర్భస్రావం అనంతరం తలెత్తిన అత్యంత అరు దైన, ప్రాణాపాయకరమైన వైద్య సమస్యను హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మల్టీడిసిప్లినరీ చికిత్స తో విజయవంతంగా పరిష్కరించారు.

32 ఏళ్ల యువతి ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఆమె గర్భాశయాన్ని సంరక్షించి భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాన్ని కూడా రక్షించారు. గతంలో సిజేరియన్ డెలివరీ, పునరావృత గర్భస్రావాల చరిత్ర కలిగిన ఈ మహిళ, ఆరు వారాల గర్భధారణలో మిస్డ్ అబార్షన్ కారణంగా స్థానికంగా డీఆండ్‌సీ చేయించుకున్నారు. అనంతరం 25 రోజులకుపైగా నిరంతర రక్తస్రావంతో బాధపడుతూ అత్యవసర పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్‌ను ఆశ్రయించారు.

సాధారణ వైద్య చికిత్సకు స్పందించకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మెడికవర్ నిపుణులు నిర్వహించిన అధునాతన ఎంఆర్‌ఐ, ఇతర ఇమేజింగ్ పరీక్షల్లో గర్భాశయంలో మూడు ప్రధాన సమస్యలు బయటపడ్డాయి. రిటైన్డ్ ప్రొడకట్స్ ఆఫ్ కన్సెప్షన్ (ఆర్‌పీవోసీ) గర్భస్రావం తర్వాత గర్భాశయంలో మిగిలిపో యిన కణజాలం, యుటెరైన్ ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ (ఏవీఎం) అసాధారణ రక్తనాళాల కలయిక, అలాగే పాత సిజేరియన్ మచ్చ వద్ద పలచబడిన గర్భాశయ పొర (స్కార్ నిచ్/ఇస్త్మోసీల్). ఈ మూడు సమస్యలు కలిసివచ్చినప్పుడు తీవ్ర రక్తస్రా వం, ప్రాణాపాయం, గర్భాశయం తొలగించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉం టుంది.

రోగి వయస్సు, భవిష్యత్ మాతృత్వా న్ని దృష్టిలో ఉంచుకుని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు గర్భాశయాన్ని కాపాడేలా దశలవారీ ప్రత్యేక చికిత్స ప్రణాళికను అమ లు చేశారు. మొదటగా డాక్టర్ సాయి తేజ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ అనే అత్యాధునిక ప్రక్రియ ద్వారా అసాధారణ రక్తప్ర వాహాన్ని నియంత్రించి, ప్రాణాపాయకర రక్తస్రావ ప్రమాదాన్ని తగ్గించారు.

తదుపరి డా క్టర్ పేరం పృథ్వి, కన్సల్టెంట్ రోబోటిక్ అండ్ లాపరోస్కోపిక్ గైనకాలజికల్ సర్జన్, అత్యం త క్లిష్టమైన మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికిత్స ద్వారా గర్భాశయంలో నిలిచిపోయిన కణజాలాన్ని తొలగించడంతో పాటు, పాత సిజే రియన్ మచ్చ కారణంగా పలచబడిన గర్భాశయ పొరను (స్కార్ నిచ్) విజయవంతంగా సరిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పేరం పృథ్వి మాట్లాడుతూ, ఈ కేసు కేవలం ఒక క్లిష్టమైన వైద్య సవాలు మాత్రమే కాదు, ఒక యువతి మాతృత్వ భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం హిస్టరెక్టమీ చే యాల్సి వస్తుంది.

అయితే మా మల్టీడిసిప్లినరీ ప్రణాళిక, మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికి త్సతో గర్భాశయాన్ని సంరక్షించగలిగాం. ఇది మా బృందానికి గొప్ప విజయం, అన్నారు. డాక్టర్ సాయి తేజ మాట్లాడుతూ, ఏవీ ఎం కారణంగా శస్త్రచికిత్స సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ద్వారా ముందు గానే రక్తప్రవాహాన్ని నియంత్రించడం వల్ల సర్జరీ మరింత సురక్షితంగా పూర్తిచేయగలిగాం.

రేడియాలజీ, గైనకాలజీ విభాగాల సమన్వయం ఈ విజయానికి ప్రధాన కారణం, అన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, ప్రస్తుతం ఆమె పూర్తి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అరుదైన విజయం మెడికవర్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, మినిమల్లి ఇన్వేసివ్ గైనకాలజీ నైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచింది. అత్యంత క్లిష్టమైన మహిళా ఆరోగ్య సమస్యలకూ ప్రాణాలను, మాతృత్వాన్ని కాపాడే ఆధునిక వైద్య సేవలను అందిస్తూ ‘మెడికవర్’ మరోసారి తన వైద్య ప్రతిభను చాటుకుంది.