ఆస్తమా అవగాహన ర్యాలీ
06-05-2026 12:06 AM
శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): వరల్డ్ అస్తమా డే 2026 సందర్భంగా నారాయణగూడ శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ అధినేత డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వివేక్‌వర్ధన్ ఆధ్వర్యంలో అస్తమాపై కీలక సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది కలిసి ఆస్తమా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ఆస్తమా బాధితులకు సరైన మందులు అందాలి, ఇన్‌హెల్లర్లు సురక్షితం భయపడాల్సిన అవసరం లేదు వంటి సందేశాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేకం గా ఈ సంవత్సరపు థీమ్ ప్రతి ఒక్కరికీ యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌హెలర్లు అందుబాటులో ఉండాలి అనే సందేశాన్ని ప్రజలకు వివరించారు.






