24 February, 2026 | 7:39 PM

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సన్మానం

24-02-2026 05:38 PM

సదాశివపేట: సర్దార్ వల్లభాయ్ పటేల్ గంజి మార్కెట్ వర్తక సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ అంజమ్మ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు నూతనంగా ఎన్నికైన సందర్భంగా సన్మానించడం జరిగింది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణకు మార్కెట్ కమిటీ అసోసియేషన్ సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లు మాట్లాడుతూ మార్కెట్... గంజిలో సమస్య ఏదైనా ఉంటే,తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్త రమేష్, అధ్యక్షులు గుద్దేటి విశ్వేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ నిజాంపురం అశోక్, సెక్రెటరీ వెన్ను ప్రమోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఓదెల రవీందర్, కోశాధికారి తాటికొండ వైద్యనాథ్, కమిటీ మెంబర్లు కొత్త రమేష్, మాలే శ్రీనివాస్, బెజగం ఆంజనేయులు, ఓం ప్రకాష్ , అమ్రాది రాజప్ప, సత్యనారాయణ, తాటికొండ రాజయ్య, కాశీనాథు, బసెట్టి సిద్ధన్న, సాయిరాం,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొత్త లక్ష్మణ్, కొమ్మ రమేష్ పాల్గొన్నారు.