11 July, 2026 | 3:50 AM

ఎస్‌ఐఆర్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి

11-07-2026 02:17 AM

భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి పవన్ కుమార్ శర్మ 

సిద్దిపేట కలెక్టరేట్, జూలై 10: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ 2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను జూలై 24 నాటికి వంద శాతం పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి డాక్టర్ పవన్ కుమార్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 22 శాతం ఫారాలే డిజిటలైజ్ అయ్యాయని పేర్కొంటూ, బీఎల్వోల పనితీరును రోజువారీగా సమీక్షించి అవసరమైన చోట వాలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తదుపరి సమీక్ష నాటికి ప్రతి జిల్లా కనీసం 50 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కె.హైమావతి సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియపైన సంబంధిత అధికారులతో జూమ్ సమావేశం ద్వార సమీక్ష నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ను వేగవంతంగా పూర్తి చేయాలని, బీఎల్వోలు, సూపర్వైజర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించి, పెండింగ్ లేకుండా లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు.