ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ అధికారులు
11-07-2026 02:18 AM
చేగుంట, జూలై 10: పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు, గుడిసెల వెరిఫికేషన్ను హౌసింగ్ పీడీ, మేనేజర్ మాణిక్యం, డీఈఈ యాదగిరి, ఏఈ రియాజుద్దీన్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ గురువారం పరిశీలించారు. ఏఈ రియాజుద్దీన్ అందించిన నివేదిక ప్రకారం మండలానికి 612 ఇండ్లు మం జూరు కాగా, 553 ఇండ్లకు మార్కౌట్, 478 ఇండ్లకు బేస్మెంట్ స్థాయి, 373 గోడల స్థాయి, 291 స్లాబ్ పనులు పూర్తయ్యాయని.. 111 ఇండ్లు పూర్తిగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.






