3 May, 2026 | 1:36 AM

హైకోర్టు, కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్!

03-05-2026 12:13 AM
  1. పేదలకు న్యాయం చేయని సికింద్రాబాద్ ఆర్డీవో, ఎమ్మార్వో 
  2. జనత కాంగ్రెస్ పార్టీ నేత ఏబెల్
  3. స్థానికేతరులకు ‘డబుల్’ ఇళ్లు కేటాయించారు
  4. డబుల్ బెడ్ రూమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్

సికింద్రాబాద్, మే 2 (విజయక్రాంతి): వాంబే ఇళ్లు దక్కని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని హైకోర్టు, జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సికింద్రాబాద్ ఆర్డీవో, ఎమ్మార్వో బేఖాతరు చేస్తున్నారని కట్టమైసమ్మ కృష్ణనగర్ వాంబే ఇళ్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జనత కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది ఏబెల్ ఆరోపించారు.

శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నగర్ కట్ట మైసమ్మ ప్రాంతంలోగత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న బాధితులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం కోసం భూమి ఇవ్వగా, వారికి ఇప్పటికీ ఇళ్లు కేటాయించలేదన్నారు. 2002లో కట్టమైసమ్మ బస్తీలో అప్పటి ప్రభుత్వం 484 మంది పేదలకు ఇండ్లు నిర్మించగా అందులో 235 మంది పేదలకు పట్టాలిచ్చారని, అందులోనూ 185 మందికి మాత్రమే ఇండ్లు కేటాయించారని చెప్పారు.

మిగిలిన వారికి కేటాయించకుండా, సుమారు 20 లక్షల రూపాయలకు బయటి వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపించారు. అర్హులైన మొత్తం 100 మంది లబ్ధిదా రులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ అక్రమాల్లో భాగ స్వాము లైన అధికారులు, స్థానిక నాయకులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.

2011లో వాంబే ఇళ్ళ లబ్దిదారు లకు కేటాయించాలని హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు ఆదేశాలతో 2012లో నగరంలోని పదకొండు మంది తహసిల్దార్లు ఇంటింటికి సర్వే చేసి నివేదికను తయారు చేసి అప్పటి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. 2019లో హైకోర్టులో పిటిషన్ వేయగా గత ఏప్రిల్ 2న వాంబే ఇండ్లు దక్కని వందమంది లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కేటాయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

హైకోర్టు ఆదేశాలు పాటించవలసిందిగా అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరిహరి చందన సికింద్రాబాద్ ఆర్డీవో, ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేసిన నిర్లక్ష్యం చేశారని చెప్పారు. అయినా కూడా ఆర్డీవో, ఎమ్మార్వో పట్టించుకోవడంలేదన్నారు. సమావేశంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు శ్రవణ్, రెండో వార్డ్ బీజేపీ ప్రెసిడెంట్ మం దుల శ్రవణ్, జి.ఎస్ సతీష్, పద్మ, సత్తెమ్మ, భవాని తదితరులు పాల్గొన్నారు.