calender_icon.png 15 February, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హే భగవాన్ టైటిల్ మారే అవకాశం!

15-02-2026 01:24:01 AM

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందారు నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి. తాజాగా వీరిద్దరి బ్యానర్లు ‘నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ‘బన్నీవాస్ వర్క్స్’ సంయుక్తంగా ‘హే భగవాన్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి ముఖ్యపాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బీ నరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్మాత వంశీ నందిపాటి విలేకరులతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. “హేభగవాన్’ కథ రాసేటప్పుట్నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నా. సమర్పకుడిగా ఇందులో భాగమయ్యాను. ఈ సినిమా పాయింట్‌లో ఫన్ ఉంటుంది. సినిమాలో బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. ప్రతిఒక్కరిని కడుపుబ్బా నవ్వించడంతోపాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది.

ఈ సినిమాలో ఫాదర్ పాత్ర పేరు భగవాన్  అందుకే హే భగవాన్.. టైటిల్ పెట్టాం. సెన్సార్ అభ్యంతరం వల్ల టైటిల్ మారే అవకాశం ఉంది. సెన్సిటివ్ టైటిల్ అంటున్నారు. గతంలో ఇలాంటి టైటిల్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు వద్దంటున్నారు. సెన్సారు బోర్డు వాళ్లతో చర్చలు జరగుతున్నాయి. ఒకవేళ ‘హే భావన్’గా మారే అవకాశం ఉంది. కొంతకాలం నుంచి సుహాస్ ఎదురుచూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి.

ఇటీవల ఫిల్మ్ చాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిష్టర్ అయ్యాయి. కేవలం ఓటీటీ కోసం కూడా చేసే సినిమాలు పెరిగాయి. ‘పొలిమేర-3’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ లేదా మేలో ప్రారంభింస్తాం. హిందీలో మినహా దక్షిణాది సినిమాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకు లీడ్ రోల్‌లో ఎవరైనా స్టార్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈటీవీవిన్‌తో కలిసి చేస్తున్న ప్రాజెక్టును ఈ నెల 27న ప్రకటిస్తా. అదే సంస్థతో మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నా” అని తెలిపారు.