15-02-2026 01:25:28 AM
విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాశ్, మురళీశర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్ర టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం హీరో మహేశ్‌బాబు లాంచ్ చేయనున్నారు. అంతకుముందు శనివారం మేకర్స్ ‘కేజీఎఫ్’ ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన పాత్ర బైరాగిని పరిచయం చేశారు. బూడిదతో అలంకరించిన శరీరం, జడలతో కూడిన గరుడ రామ్ లుక్ చూస్తే.. సినిమాలో ఆయన శక్తిమంతమైన తాంత్రిక యోధుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్; సంగీతం: అభే, జునైద్ కుమార్; ప్రొడక్షన్ డిజైన్: అశోక్‌కుమార్; ఎడిటర్: ఆర్సి ప్రణవ్.