18 May, 2026 | 2:11 AM

రీంగారా.. రీంగారా..

18-05-2026 01:11 AM

‘బిచ్చగాడు’ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ‘వంద దేవుళ్ళు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజ య్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు ముఖ్యపాత్రల్ని పోషించారు.

ఈ చిత్ర పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పా టలు ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఒక రొ మాంటిక్ మెలోడీ గీతాన్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘రీంగారా’ అంటూ సాగే ఈ పాట లో లిజమోల్ జోస్, అజయ్ ధీషాన్ జంట ఆకట్టుకుంటోంది. భాష్య శ్రీ రాసిన ఈ పాట ను బాలాజీ శ్రీరామ్ బాణీ స్వరపర్చగా సంతోష్ హరిహరణ్, మానసి జి కణ్ణన్ ఆలపించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరామెన్: ఎస్‌బీ దర్శన్ కిర్లోష్; సంగీతం: బాలాజీ శ్రీరామ్; ఎడిటర్: హరిష్ యువరాజ్; డైలాగ్స్: భాష్య శ్రీ.