18 May, 2026 | 2:10 AM

ముహూర్తం ఖరారు

18-05-2026 01:08 AM

చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్  పతాకంపై రూపొందు తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘చిరు ‘చిరు౧౫౮’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారం లో ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి కాంబో మళ్లీ రిపీట్ అవుతుండ టంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. మే 21న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందీ సినిమా.

ఈ విషయ్నా చిరంజీవి స్వయంగా  ప్రకటించారు. ఈ మేరకు ఒక పవర్‌ఫుల్ జిమ్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇం టెన్స్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయ న పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చేస్తున్న ట్రైనింగ్ ఈ సిని మాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్‌కు హింట్ ఇస్తోంది.

ఇక ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ... “గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. మే 21 ముహూర్తం.. కేవీఎన్ ప్రొడక్షన్స్ వారిది.. అంటే ఇంకో నాలుగైదు రోజు ల్లో కలుస్తున్నాం. గెట్ రెడీ” అని చెప్పారు. ఎక్స్‌ఫ్లోసివ్ పవర్, ఫంక్షనల్ స్ట్రెంగ్త్, స్టామి నా మీద ఫోకస్ చేసిన ఆ ట్రైనింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత సినిమాలపై చిరంజీవి ప్యాషన్ మరోసారి స్పష్టమవుతోంది. ప్రతి వర్కౌట్లో కనిపిస్తున్న ఆ ఇంటన్సిటీ, తెరపై మరొకసారి ఎలక్ట్రిఫై చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఆయన తపన ఇంకా పెరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, లుక్ టెస్ట్ ఇమేజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.