15 June, 2026 | 3:17 AM

18 నుంచి 20 మధ్య భారీ వర్షాలు

15-06-2026 02:08 AM

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 20 మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం, మంగళవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 30 నుంచి -40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.