సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ చెక్కు అందజేత
దోమకొండ, ఆగస్టు 4 ( విజయ క్రాంతి): దోమకొండ మండలానికి చెందిన కంశెట్టి మణెమ్మ కీళ్ల శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లడంతో, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.75 వేల విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది.
మంగళవారం కంశెట్టి మణెమ్మకు సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ చెక్కును ప్రజాప్రతినిధులు అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్, మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, టౌన్ అధ్యక్షుడు సీతారాం మధు, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు కూర లతసంతోష్, చేనేత చైర్మన్ బత్తిని సిద్ధరాములు, కటికే శ్రీనివాస్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.






