కోటగుళ్లలో జిల్లా ప్రధాన ఆస్పత్రి
05-08-2026 01:42 AM
సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం పూజలు
గణపురం, ఆగస్టు 4 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం పూజలు నిర్వహించారు. సూపరింటెండెంట్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజు శాలువాలు పూలమాలతో వారిని ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.






