ఘనంగా శ్రీరామ హృదయం నగర సంకీర్తన
- పురవీధుల్లో కొనసాగిన ఊరేగింపు
- కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం,ఆగస్టు 4 (విజయ క్రాంతి) : శ్రీశ్రీశ్రీ చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో తిరు నక్షత్ర మహోత్సవం శ్రీ రామ హృదయం శ్రీ రాముని మదిలో నింపండి శ్రీరాముని మదిలో చేరండి కార్యక్రమంలో భాగంగా మంగళవారం గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి దేవాలయం నుండి కలశంతో నగర సంకీర్తన నిర్వహించారు. మండలంలో 29-జులై -2026 బుధవారం గురుపౌర్ణమి నుండి 12-ఆగస్టు బుధవారం వరకు పక్షం రోజులు నిర్వహించనున్నారు.అందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ పాల్గొని కలశ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఆకుల సుభాష్, శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించగా నగర సంకీర్తన పురవీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, భజన మండలి సభ్యులు , తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్, భటిక స్వామి,బూర రాజగోపాల్ గౌడ్, మూల శ్రీనివాస్ గౌడ్, మాదాసు అర్జున్ గౌడ్, మొగిలి గౌడ్, పెరుమాండ్ల భద్రయ్య, మోట పోతుల రాజన్న, సదానందం, దయ్యాల భద్రయ్య, బండారి శంకర్, పాండవుల భద్రయ్య రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.






