13 July, 2026 | 5:20 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ గురుకుల విద్యార్థినుల ఆందోళన

19-02-2026 01:44 AM

కల్వకుర్తి ఫిబ్రవరి 18: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు . కళాశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేసి సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు.

నాసిరకమైన భోజనం అందిస్తున్నారని, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే దూషణలకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. విద్యార్థినులు హైదరాబాద్‌శ్రీశైలం ప్రధాన రహదారిపై, ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులతో చర్చించి అక్కడినుండి కళాశాల వద్దకు తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.