19-02-2026 01:46:19 AM
అలంపూర్ ఫిబ్రవరి 18: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావును, డీఎస్పీ మొగులయ్యను వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మంజుల ధర్మ, వైస్ చైర్మన్ సారంద మధుసూదన్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ, డీఎస్పీకి వారు పుష్పగుచ్చం అందజేసి శాలువ కప్పి సన్మాంచించారు.
నూతన చైర్మన్ వైస్ ఛైర్మన్ ఇరువురికి ఎస్పీ ,డీఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులతో పాటు మీరు కూడా భాగస్వాములై వడ్డేపల్లి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఎస్పీ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ వైస్ ఎంపీపీ చంద్ర శేఖర్ గౌడ్, కౌన్సిలల్ విజయ్ భాస్కర్,అజయ్, తదితరులు పాల్గొన్నారు.