28 May, 2026 | 7:19 PM

ఉద్యోగుల ఆరోగ్య పథకం విది విధానాలు వెంటనే విడుదల చేయాలి

28-05-2026 05:47 PM

 టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ అనేక ఉపాధ్యాయ, ఉద్యోగ రంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. కొద్ది నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ పరిస్థితుల అనిశ్చితి, జరుగుతున్న ఉపాధ్యాయ ఉద్యమాలకు సంబంధించిన రిపోర్టును ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.ఈ హెచ్ ఎస్ కు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన విది విధానాలు వెంటనే విడుదల చేసిన అనంతరమే జేఏసీ ఒప్పందం మేరకు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కోరాలని ఆన్నారు.పి ఆర్ సి నివేదికను తెప్పించుకొని వెంటనే అమల్లోకి తేవాలన్నారు. 5 కరువు భత్యాలను కొత్త పి ఆర్ సి లో సవరించబడే శాతం మేరకు చెల్లించాలన్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు బదులుగా ఉన్న పాఠశాలల బాగోగుల పై దృష్టి సారించి, మెరుగైన విద్యా కోసం కృషి చేయాలన్నారు.నామ మాత్రంగా కాకుండా అన్ని ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక పాఠశాలలు కేటాయించి ప్రాథమిక విద్యా బలోపేతానికి బీజాలు వేయాలన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రికార్డులను ఆన్లైన్ లో నమోదు తేదీని సెన్సస్ విధుల కారణంగా జూన్ 30 వరకు పొడిగించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షన్ సొమ్మును వెంటనే చెల్లించాలన్నారు. 2025, 2026 సంవత్సరాల పదవ తరగతి మూల్యాంకన భృతిని అన్ని జిల్లాలకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులతో పాటు అసోసియేట్ అధ్యక్షులు జీ తిరుపతి రెడ్డి,అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, ఉపాధ్యక్షులు, పి.నారాయణమ్మ, డి.శ్రీనివాస్,  ఎం.లక్ష్మయ్య యాదవ్, బి.రాజు, కార్యదర్శులు: రావుల రమేష్, ఎస్.విజయ్, బి.రమేష్, డి రాజయ్య, వై పద్మ లు పాల్గొన్నారు.