గరిడేపల్లి లో ఘనంగా బక్రీద్ వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్
గరిడేపల్లి, మే 28,(విజయక్రాంతి): మండలంలో గురువారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని గడ్డిపల్లి ఈద్గా కు గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ముస్లిం కుటుంబాలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు నిర్వహించుకునే ప్రతి పండుగను ప్రతి ఒక్కరు గౌరవించాలని తద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ముందుకు వెళ్లి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.
మండలంలోని కీతవారిగూడెం, పొనుగోడు, కల్మలచెరువు, గానుగ బండ, కుతుబ్ షా పురం, అప్పన్నపేట, అబ్బిరెడ్డిగూడెం, గరిడేపల్లి గ్రామాల్లో ముస్లిం కుటుంబాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కీతవారిగూడెం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ మియా, మస్తాన్, కాసిం, సఫియా మీరా, మస్జిద్ ముజాన్ సైదా తోపాటు కల్మలచెరువు, పొనుగోడు, గానుగ బండ గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






