మహిళా సంఘ భవనానికి భూమిపూజ
మహిళా సంఘ భవనానికి భూమిపూజ చేసిన సర్పంచ్ షేక్ యాస్మీన్ ఫిరోజ్ పాషా
కోనరావుపేట, జూన్ 11(విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని మహిళా చైతన్య సమైక్య మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘ భవన నిర్మాణం కోసం వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులకు గ్రామ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ సర్పంచ్ శ్రీమతి షేక్ యాస్మీన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళల అభివృద్ధి, సాధికారత మరియు సంక్షేమానికి ఈ భవనం ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌కు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం పద్మయ్య, ఏపీఎం రాజేశం, ఉపసర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు ఊరడి రమేష్, సునీత, అరె సుజాత, సీసీ జనార్దన్, వీవోఏలు తిక్కల బాబు, పుల్లూరి రాజేశం, వీవోలు జంగం సోనియా, భూతగడ్డ గీతా, గొల్లపెల్లి హారిక, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.






