12 May, 2026 | 9:42 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఎమ్మెల్యే మదన్‌మోహన్ కృషితో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ

03-03-2026 12:11 AM

ఎల్లారెడ్డి, మార్చి 2 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో మహిళల సాధికారతకు మరొక కీలక అడుగు పడింది. ఎమ్మెల్యే మదన్ మోహన్  ఆదేశానుసారం రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఘనంగా భూమిపూజ కార్యక్రమం, గ్రామ సర్పంచ్ గ్రామంలోని మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించబడుతున్న ఈ భవనం ద్వారా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూల వేదికగా నిలవనుంది.

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, మహిళల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్  నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా రూ.10 లక్షల నిధులను మంజూరు చేసి ఈ భవనం నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవనం నిర్మాణంతో మాచాపూర్ గ్రామంలో మహిళల అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడనుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.