12 May, 2026 | 9:32 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు

12-05-2026 08:21 PM

దమ్మపేట,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఈ నెల 14తో తొలిసారి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసి 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తుమ్మల గతంలో దమ్మపేట మండల కేంద్రంలో ముస్లింలకు అడిగిన వెంటనే షాది ఖానా, ఖబరస్తాన్ లకు రెండు ఎకరాల స్థలం కేటాయించి ముస్లింలకు అండగా నిలిచారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ది ప్రదాత, దమ్మపేట మండల ముద్దుబిడ్డ తుమ్మల నాగేశ్వరావుకు అభినందనలు, కృతఙ్ఞతలు తెలుపుతూ మంగళవారం సాయంత్రం దమ్మపేట మసీదు కాంప్లెక్స్ నందు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, కెవి సత్యనారాయణ, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యు తరావుల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆదిష్టించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.