22 July, 2026 | 2:43 AM

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

22-07-2026 01:17 AM

రాజాపూర్ జూలై 21 :  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కలలు సహకారం చేసేందుకే ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నారని సర్పంచ్ రామకృష్ణ అన్నారు. మంగళవారం రాజపూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో విజయలక్ష్మితో కలిసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు. వార్డు సభ్యుడు ఆదిత్య,గోవర్ధన్ రెడ్డి, ఇస్తారయ్య పాల్గొన్నారు.