22 July, 2026 | 2:45 AM

ఓటర్ నమోదు ప్రక్రియలో బీఎల్‌ఏ, సూపర్వైజర్ల పాత్ర కీలకం

22-07-2026 01:17 AM

ఎమ్మెల్యే మందుల సామేలు, సర్ పక్రియ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య.

తుంగతుర్తి, జూన్ 21 : ఓటర్ నమోదు ప్రక్రియలో బిఎల్‌ఎ, సూపర్వైజర్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే మందుల సామేలు సర్ ప్రక్రియ నియోజకవర్గ ఇన్చార్జి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గస్థాయి మండల అధ్యక్షులు, బి ఎల్ ఏ లు, సూపర్వైజర్లు సర్పంచులు మాజీ సర్పంచులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఓట్లను తీసివేత ప్రక్రియకు పూనుకొందని, మాయ మాటలతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఓటర్ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిఎల్‌ఎలు సూపర్వైజర్లు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 20వేల ఓట్లు పోతాయని తెలిపారు.

గ్రామాల్లో చనిపోయిన వారి సంఖ్య, గతంలో హైదరాబా దులో గ్రామాల్లో ఉండేవారు ఓట్లు ఉండేవి ఇప్పుడు ఏదైనా ఒకే చోట ఓట్లు ఉండే ఆస్కారం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నియమించిన బియల్‌ఏలు, సూపర్వైజర్లు, ఓటర్ నమోదు పక్రియలు అంకితభావంతో పనిచేసే మంచి గుర్తింపుకు తేవాలని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 33 మంది బిఎల్‌ఎలు పనిచేస్తున్నట్లు, మంచిగా పని చేసినట్లయితే, వీరిని ముఖ్యమంత్రితో కల్పించి ఫోటో తీసుకునేటట్టు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని అన్నారు.

ఏలినివో ప్రభావంతో నియోజకవర్గం లో వర్షాలు లేకుండా పోయాయని, రైతులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. తుంగతుర్తి మండల కేంద్రంలో సుమారు 56 అడుగుల జాతీయ జెండా ఏర్పాటుకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థల పరిచిన చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గల గడ్డపోరు గడ్డ తుంగతుర్తి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పి ఎస్ సి ఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మండల అధ్యక్షులు రేగటి రవి గౌడ్, పచ్చిపాల వెంకన్న, సుంకర జనార్ధన్, వెంకటేశం, మధుకర్ రెడ్డి, మల్లారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గంగరాజు యాదవ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచర్ల అనిల్, కొండా రాజు, రామ్ చందర్, జెమ్మిలాల్, దాసరి శ్రీను, పోలపాక రామచంద్రు, మహేందర్ గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.